అన్నం లేకపోవడమే పేదరికరం కాదు..?
జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం..
ఓ మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది..
అన్నం లేకపోవడమే పేదరికరం కాదు..
కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం..
నీ మాటలను, చేతలను పొగిడేవారికంటే..
నీ తప్పిదాలను మృదువుగా వివరించేవారే నమ్మదగిన వారు..
మర్యాదగా వినడం, వివేకంతో సమాధానమివ్వడం..
ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం..
ప్రతి మనిషికి అవసరం..
మీ అపజయాన్ని తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి..
అవి తప్పులు కావు.. భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు..