యోగిని ఏకాదశి.. ఉపవాసం వుంటే పారణ తప్పనిసరి..
నిర్జల ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశిని, దేవశయని ఏకాదశికి ముందు వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. యోగిని ఏకాదశి ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షంలో వస్తుంది.
యోగిని ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి. ప్రస్తుత జీవితంలో అన్ని విలాసాలను అందిస్తుంది. యోగిని ఏకాదశి ఉపవాసం పాటించిన తర్వాత స్వర్గ లోకానికి చేరుకోవచ్చు.
ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు సూర్యోదయం తర్వాత ఏకాదశి పారణ చేస్తారు. సూర్యోదయానికి ముందు ద్వాదశి ముగియని పక్షంలో ద్వాదశి తిథిలోగా పారణ చేయాలి.
ద్వాదశి తిథి పూర్తయ్యే లోపల ఏకాదశి రాత్రి జాగరణ ముగించుకుని.. మరుసటి రోజు పారణ సమయాన్ని తెలుసుకుని.. సూర్యోదయానికి ముందే స్వామికి సర్వ నైవేద్యాలు సమర్పించి ఉపవాసం పూర్తి చేయాలి.
యోగిని ఏకాదశికి పారణ సమయం
యోగిని ఏకాదశి 2024 కోసం పరణ సమయం, ఉపవాసం విరమించే సమయం జూలై 03, ఉదయం 5:49 నుండి ఉదయం 7:10 వరకు.