మంగళవారం, 27 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Selvi
Last Updated : సోమవారం, 7 జులై 2014 (18:17 IST)

దీపం వెలిగించేటప్పుడు ఏ మంత్రం చదవాలి?

దేవుని వద్ద దీపం వెలిగించేటప్పుడు చదవవలసిన మంత్రం 
 
దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమో పహః |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే ||
 
భావం... దీపం జ్యోతి స్వరూపమైనది. అదే పరంబ్రహ్మం, దీపం చీకటిని పారద్రోలుతుంది. ఈ దీపం వల్లే సర్వకార్యాలు సుగమం అవుతున్నాయి. అటువంటి సంధ్యా దీపమా! నీకు నమస్కారం అని అర్థం. 
 
దీపం సర్వవేళలా ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు. ఎవరి ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులని పురోహితులు అంటున్నారు. అజ్ఞానం = చీకటి, జ్ఞానం = వెలుతురు. మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే కాంతిని సర్వత్ర ప్రసరింపజేసే పరమాత్మ స్వరూపమే దీపం అని శాస్త్రాలు చెబుతున్నాయి.