శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Selvi
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (15:07 IST)

ఆంజనేయ స్వామికి ఆవనూనెతో 41 రోజుల పాటు దీపమెలిగిస్తే?

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అందుకే ఆరోగ్యంగా ఉండటమే సిరిసంపదలతో ఉన్నట్లు భావిస్తారు. అలాంటి ఆరోగ్యానికి.. ఇబ్బందులు ఏర్పడితే.. అంటే అనారోగ్య సమస్యలు ఏర్పడితే.. ఆంజనేయస్వామిని తప్పకుండా పూజించాల

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అందుకే ఆరోగ్యంగా ఉండటమే సిరిసంపదలతో ఉన్నట్లు భావిస్తారు. అలాంటి ఆరోగ్యానికి.. ఇబ్బందులు ఏర్పడితే.. అంటే అనారోగ్య సమస్యలు ఏర్పడితే.. ఆంజనేయస్వామిని తప్పకుండా పూజించాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సాధారణంగా అనారోగ్య సమస్యలు తరచూ వేధిస్తుంటే.. ఆత్మీయులకు  అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు ఆంజనేయ స్వామిని పూజించడం ఉత్తమం. 
 
మీకు లేదా ఇతరులకు అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు తేలికైన పరిహారంతో దీన్ని నయం చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి ఆలయంలో 41 రోజుల పాటు.. మండల దీక్ష చేయాలి. 41 రోజులకు మండల దీక్షగా పేరుంది. అందుకే 41 రోజుల పాటు హనుమంతుడికి ఆవనూనెతో దీపారాధన చేయాలి. ఇలా చేస్తే ఎలాంటి అనారోగ్యమైనా దరిచేరదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.