గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 11 జులై 2022 (23:14 IST)

సర్వమంగళనామా సీతా రామారామా

Sitarama
సర్వమంగళనామా సీతారామారామా
శర్వవినుత శాంతి దాతారామారామా
మనసులోని మాయ బాపి రామారామ
మనుపుమా నీమోము జూపి రామారామా
నీవు నేనను భేదా బుద్ధీ మాపి మాలో
నిలుపుమా జ్ఞాన సిద్ధి రామారామా
కామక్రోధాలోభా మోహపాశంబులా
కడకు ద్రోసికావుమయ్యా రామారామా
ఏకశిలా పురవాసా సీతారామరామా
లోకేశా బహురూప విలాస కోదండరామా
రామకృష్ణ గోవిందా నారాయణా
ప్రేమించి పాలించునారాయణా