మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : శనివారం, 30 జూన్ 2018 (09:32 IST)

శ్రావణ మాసంలో ''మంగళగౌరీ'' వ్రతం చేస్తే.....

శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతం ఆచరింటే మహిళలకు సకల సంపదలు చేకూరుతాయి. శ్రావణమాసంలో మహిళలు ఆచరించే వ్రతాలలో మంగళగౌరీ వ్రతం ప్రధానమైనది. దీనిని శ్రావణమాసంలోని తొలి మంగళవారం మెుదలుపెట్టి అన్ని మంగళవారాలు ఆ

శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతం ఆచరింటే మహిళలకు సకల సంపదలు చేకూరుతాయి. శ్రావణమాసంలో మహిళలు ఆచరించే వ్రతాలలో మంగళగౌరీ వ్రతం ప్రధానమైనది. దీనిని శ్రావణమాసంలోని తొలి మంగళవారం మెుదలుపెట్టి అన్ని మంగళవారాలు ఆచరించాలి. ఐదు ముఖాలున్న మంగళగౌరీ ప్రతిమను తయారు చేసుకుని పూజామందిరం ప్రతిష్టించి పూజలు చేయాలి.
 
కొత్తగా పెళ్ళయినవారు ఈ మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించి శ్రావణమాసంలోని అన్ని మంగళవారాలు ఆచరించి ఐదు సంవత్సారాలు దీనిని చేసి ఉద్యాపన చేయాలి. తొలిసారి నోమును ప్రారంభించేవారికి వారి తల్లి ప్రక్కన ఉండి నోమును చేయించడం వాయనాన్ని స్వీకరించాలని పండితులు చెబుతున్నారు.
 
ఉద్యాపన నోము ఐదు సంవత్సరములు నోచిన తరువాత ఉద్యాపన చేయవలయును. మెుదటిసారి అయిదుగురు, రెండవ యేట పదిమంది, మూడవయేట పదిహేనుమంది నాల్గపయేట ఇరువైమంది, ఐదవయేట ఇరువైఐదుమంది ముత్తైదులను పిలిచి వాయనుము ఇవ్వాలి. 
 
ఇలా ఐదు సంవత్సరములు చేసిన తరువాత పెండ్లి దినమున పెండ్లికుమార్తెను ఒక కొత్తకుండలో ముప్పది మూడు జోడుల అరిసె పెట్టి కొత్తరవికె గుడ్డతో దానికి వాసన కట్టి మెట్టెలు మంగళసూత్రములు పెట్టి ఇవ్వాలి. కానీ ఈ పద్ధతిలో లోపము వచ్చినను ఫలితములో లోపమురాదని పురోహితులు చెబుతున్నారు.