బుధవారం, 27 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By సిహెచ్
Last Modified: శనివారం, 4 జులై 2020 (22:51 IST)

ఆదిత్యునికి అలా పూజ చేస్తే...

పంచాంగంలో ఆదివారం నాడు నియమనిబంధనలున్నాయని జ్యోతిష నిపుణులు చెపుతున్నారు. ప్రధానంగా.. ఆదివారం అనే పదం ఆదిత్య వారం నుంచి పుట్టిదని సాహిత్య నిరూపణము. సంస్కృతమున భానువారంగా పిలువబడుతోంది. భారత దేశములోని కొన్ని ప్రాంతాలలో ఇది సూర్యదేవుని పేరుతో "రవివార్"గా ఇప్పటికీ పిలుస్తున్నారు. కొన్ని దేశ, సంస్కృతులలో ఇది వారాంతంలో రెండవ రోజు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆదివారాన్ని సెలవుదినంగా పాటిస్తారు. 
 
వారంలో మొదటి రోజుగా పరిగణించే ఆదివారం నాడు పాటించాల్సిన కొన్ని నియమనిబంధనలు పరిశీలిస్తే.. ఆదివారం ఉదయాన్నే సూర్యస్త్రోత్రం పఠించడంతో పాటు స్నానమాచరించి సూర్య నమస్కారం చేయడం మంచిదని జ్యోతిష్కులు అంటున్నారు. సూర్యస్తోత్రం తర్వాత ఆలయ దర్శనం గావించి, ఎరుపు పువ్వులు స్వామికి సమర్పించడం ఉత్తమమని వారు పేర్కొంటున్నారు.
 
ఆదివారం రోజున స్త్రీలు తలలో మందారం వంటి ఎరుపు పువ్వులు ధరించడం సౌభాగ్య చిహ్నమని, అదేవిధంగా ఎరుపు రంగు దుస్తులు ధరించడం శ్రేష్టమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. భానువారమున సూర్యభగవానునికి గోధుమలు, నవధాన్యాలను నైవేద్యంగా సమర్పించినట్లైతే సకల సంపదలు దరి చేరుతాయి.