గురువారం, 14 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (15:29 IST)

ఆయుష్షును కోరేవారు ఇలా చేయాలి..?

చాలామంది భక్తులు ఎప్పుడు ఏ దేవుని పూజిస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయో తెలిస్తే కచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటారు. దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది. మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు. ఇక్కడ.. సమారాధనం అంటే దేవుని ప్రతిమ నుండే వేదిక. పూజలు మనకున్న ఏడు వారాలలో ఒక్కొక్క వారం ఒక్కో దేవతకు చెయ్యాల్సి ఉంటుంది.
 
ఆదివారం:
ఈ రోజు ఆదిత్యుని, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వలన నేత్రరోగం, శిరోరోగం తగ్గుతాయి. ఈ పూజ తరువాత వేద పండితులను పూజించాలి. ఇలా రోజు నుండి మాసం లేదా సంవత్సరం పాటు రోగ తీవ్రతనను గురించి పూజ చేయాలి. ఇలా చేయడం వలన సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.
 
సోమవారం: 
ఈ నాడు సంపద కోరుకునేవారు లక్ష్మీదేవిని ఆరాధించాలి. పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.
 
మంగళవారం: 
ఈ రోజు కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పుతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.
 
బుధవారం:
ఈ రోజున పెరుగు అన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ, నివేదనల వలన పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్యకు చక్కని ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
 
గురువారం:
ఆయుష్షును కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలు. 
 
శుక్రవారం:
ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చును. వేద పండితులకు భోజనాన్ని పెట్టాలి.
 
శనివారం: 
ఈ రోజున రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుండి తప్పించుకోవాలనుకునేవారు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయడం వలన పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.