శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : శనివారం, 7 ఫిబ్రవరి 2015 (13:43 IST)

భాగస్వామితో మాట్లాడేటప్పుడు చేతులతో తాకండి!

భాగస్వామితో మాట్లాడేటప్పుడు బాడీ లాంగ్వేజ్‌ను గమనించండి. మిగతావారికంటే కాస్త ఎత్తుగా కవిపించేలా కూర్చోవడం, పాదాల్ని పైకి చూసేలా ఉంచడం, చేతుల్ని అప్పుడప్పుడూ మెడ వెనక్కు తీసుకెళ్లడం ఇవన్నీ వ్యక్తిలోని నేనే గొప్ప అనే భావనకు సంకేతాలు. 
 
ఇందుకు వ్యతిరేకంగా కాస్త కిందకు కూర్చుంటే వాళ్లలో తమను తాము రక్షించుకునే ధోరణి ఉంటుంది. మీ భాగస్వామి ఈ రెండింట్లోనూ ఏ కోవకు చెందినా, మీరు చేయాల్సిందల్లా వాళ్లని ప్రతిబింబించడమే. అంటే వాళ్లు ఎత్తుగా కూర్చుంటే మీరూ అలాగే చేయండి. అప్పుడు తమతో మీరు కలిసిపోతారని.. అన్ని వేళలా సహకరిస్తారనే నమ్మకం ఎదుటివాళ్లకు కలుగుతుంది. 
 
మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు నోటినీ గమనించండి. నవ్వుకోసం పెదవులు విచ్చుకునే తీరు, అవి సున్నాల మారడం, నాలుక చేసే విన్యాసం ఇవన్నీ భాగస్వామి మనసుని మాటలకన్నా ఎక్కువగా పట్టిస్తాయి. ఓ సారి గమనించి చూడండి. దంపతులిద్దరూ ఏ విషయం మాట్లాడుకున్నా.. చేతులతో తాకండి. మాటలెన్నో చెప్పలేని లాలనని ఓ చిన్న స్పర్శ చెప్పేస్తుంది.