గురువారం, 8 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (18:30 IST)

మనసు చెప్పిన మాట వినండి..!

వృత్తి.. వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడం సాధ్యం కానప్పుడు మనసుకు తగ్గట్టు నడుచుకోవడమే మార్గమని సైకాలజిస్టులు అంటున్నారు. కొందరు మొహమాటం, ఎవరేమనుకుంటారో అనే భయం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. చిన్నపాటి ఆనందాలనూ వదులుకుంటారు. 
 
ఆఫీసు వేళలు పూర్తయినా, పనిలేకున్నా ఇంటికి బయల్దేరాలంటే మొహమాటపడటం, పిల్లలు పెద్దవాళ్లయినా దంపతులిద్దరూ సరదాగా బయటకు వెళ్లకపోవడం, ఇలా ఎన్నో ఆఫీసులోనూ, ఇంట్లోనూ.. అయితే మీకేది ఆనందాన్నిస్తుందో అది మాత్రమే చేయండి. 
 
ఒకవేళ చాలామంది ఉద్యోగినుల్లో ఇప్పుడు తాము చేస్తున్న పనిపై తీవ్ర అసంతృప్తి ఉంటుంది. అలాంటివాళ్లు ప్రస్తుతం ఉద్యోగం కాకుండా ఇంకేం చేస్తే ఆనందంగా ఉంటారో ఆలిచించాలంటున్నారు నిపుణులు. కానీ ఇక్కడ మనసుమాట వినడం ఒక్కటే సరిపోదు. 
 
మన ఆసక్తి ఉన్న రంగానికి బయటి మార్కెట్‌లో ఉన్నవిలువేమిటి? అటువైపు వెళితే కనీసం మీ జీవితం గడిచేంత ఆదాయం దొరుకుతుందా? ఆదాయం తక్కువైతే.. అందుకు తగ్గట్టు మీరూ, మీ కుటుంబం మొత్తం ఇప్పటి జీవనశైలిని మార్చోగలరా? అని ఆలోచించుకోండి. అందుకే మనసుకు నచ్చినట్లు నడుచుకుంటే సరిపోతుందని సైకాలజిస్టులు అంటున్నారు.