కళ్ళు అదిరితే ఏమవుతుంది..
మనకు రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి. ఆ సెంటిమెంటులో కన్ను అదరడం కూడా ఒకటి. కన్ను అదిరితే బాబోయ్ ఏదో జరుగుతుందని అనుకుంటాం. కానీ కన్ను అదరడంపై మన భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా వీటిని నమ్ముతారు. అలాగే మన వాళ్ళు మగవారికి కుడి కన్ను అదిరితే మంచిది. ఆడవార
మనకు రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి. ఆ సెంటిమెంటులో కన్ను అదరడం కూడా ఒకటి. కన్ను అదిరితే బాబోయ్ ఏదో జరుగుతుందని అనుకుంటాం. కానీ కన్ను అదరడంపై మన భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా వీటిని నమ్ముతారు. అలాగే మన వాళ్ళు మగవారికి కుడి కన్ను అదిరితే మంచిది. ఆడవారికి ఎడమ కన్ను అదిరితే మంచిది అని చెబుతుంటారు.
అలాగే ఆడవారికి కుడి కన్ను అదిరితే సమస్యలు వస్తాయని, మగవారికి ఎడమ కన్ను అదిరితే మంచిది కాదని చెబుతుంటారు. అయితే విషయమేమిటంటే కేవలం మన భారతీయులే కాదు చైనీయులు, అమెరికన్లు కూడా ఈ కన్ను అదరడాన్ని నమ్ముతారు. చైనీయులు మనకు పూర్తి వ్యతిరేకంగా నమ్ముతారు. మగవారికి కుడి కన్ను అదిరితే మంచిదని, ఆడవారికి ఎడమ కన్ను అదిరితే మంచిదని నమ్ముతారు. ఇక అమెరికా వారు ఎడమ కన్ను అదిరితే బంధువులు కాని, అపరిచిత వ్యక్తులు గాని ఇంటికి వస్తారని కుడి కన్ను అదిరితే ఆ ఇంట్లో త్వరలో శిశువు వస్తుందని నమ్ముతారు.
అలాగే చైనా కంటి శాస్త్రం ప్రకారం ఎడమ కన్ను అయితే గొప్ప వ్యక్తి ఇంటికి వస్తారని, కుడి కన్ను అయితే పార్టీకి ఆహ్వానం లభిస్తుందని అంటారు. ఏదెలా ఉన్నా కన్ను శాస్త్రం ప్రకారం ఎక్కువ సేపు కన్ను అదురుతుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక అశుభం కలుగుతుంది. సైన్స్ ప్రకారమైతే పోషకాహార లోపమే కాకుండా నిద్రలేమి, కాలుష్య పూరిత వాతావరణం, కంటి సంబంధిత సమస్యలున్నా అలా కళ్ళు అదురుతాయి. కాబట్టి కళ్ళు ఒకటి కంటే ఎక్కువ రోజు అలాగే అదురుతుంటే కంటి ఆసుపత్రికి వెళ్ళాలి.