బుధవారం, 15 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 31 మే 2016 (16:46 IST)

తిరుమలలోని జపాలీ తీర్థంలో ఘనంగా హనుమాన్‌ జయంతి.. పోటెత్తిన భక్తజనం

హనుమాన్‌ జయంతిని తిరుమలలో ఘనంగా నిర్వహించారు. ఎంతో ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన జపాలీ తీర్థంలో ప్రతియేటా జయంతిని నిర్వహిస్తూ వస్తున్నారు. ఉదయం నుంచి జపాలీలో భక్తులు పోటెత్తారు. స్వామి ఆలయంలో ప్రత్యేక

హనుమాన్‌ జయంతిని తిరుమలలో ఘనంగా నిర్వహించారు. ఎంతో ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన జపాలీ తీర్థంలో ప్రతియేటా జయంతిని నిర్వహిస్తూ వస్తున్నారు. ఉదయం నుంచి జపాలీలో భక్తులు పోటెత్తారు. స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. జపాలీని దర్శింర్సించుకుంటే జన్మజన్మ పుణ్యఫలమని పురాణాలు చెబుతుండటంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు జపాలికి చేరుకున్నారు. 
 
జపాలి ప్రాశస్త్యం.... దట్టమైన అటవీ ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో చుట్టూ చక్కని జలపాతాలతో దివ్య తీర్థాలతో పక్షుల కిలకిల రావాలతో బెట్టుడుతల ఉయ్యాలాటలతో దివ్య సుగంధాలతో ఔషద మూలికలు సంపదతో కారణ జన్ముల కర పాద స్పర్శతో తిరుమలకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పాపవినాశనం వెళ్లే దారిలో ఉన్న ఒక సుందర చారిత్రాత్మక హనుమాన్‌ దివ్య తీర్థరాజం ప్రసిద్థ హనుమ క్షేత్రం. 
 
33 కోట్ల దేవలత ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు, రామావతారంను దాల్చినపుడు రుద్రుడు శ్రీరామ దూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించుటకు నిశ్చంయించుకునెను. అప్పుడు జావాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందు ఆ రూపాన్ని ప్రసన్నం గావించుకొనుటకు, ఎన్నో ప్రదేశాల్లో తపస్సు చేసుకుంటూ కడకు శ్రీ వేంకటాచలంలో (తిరుమల) జప హోమం చేయసాగెను. అతని భక్తికి మెచ్చి భగవంతుడు తన యొక్క రాబోవు హనుమంతుని రూపాన్ని స్వయంభువుగా అవతరించె చూపెను. జపం వల్ల అవతరించినందున ఈ స్థలం జపాలి అయ్యింది. 
 
అప్పుడే అన్ని తీర్థరాజములు వచ్చి చేరినందువల్ల జపాలీ తీర్థం అని పేర్కొనబడింది. ఇక్కడికి అతి సమీపంలోని ఆకాశగంగలో అంజనాదేవి తపమాచరించి ఆంజనేయ అవతారమునకు సంకల్పించింది. హనుమంతుని కొరకు ఆదిశేషుడు కూడా పర్వతముగా మారి బ్రహ్మధర్మాన్ని పాటిస్తున్నట్లున్నది. అలా మారిన శేషగిరిపై శ్రీ వేంకేటశ్వర స్వామి తన అభయహస్తములతో చరణ దాసుడైన హనుమంతుని చూపుతున్నట్లు అర్చావతారంగా నిలిచెను. 
 
అయోధ్య కాండలో జావాలి బుషి తన యొక్క ధర్మవిరుద్ధమైన మాటలకు వాళ్ళు దోషాన్ని మూటగట్టుకుని జపాలీ తీర్థంలో తపస్సు చేసి రామగుండంలో స్నానమాచరించి వాళ్లు దోష విముక్తలయ్యెను. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్య వెడుతూ సతీసమేతంగా ఈ తీర్థంలో రాముడు స్నానమాచరించెనని పురాణాలు చెబుతున్నాయి. 
 
హథీరాంజీ పర్యవేక్షణలో ఉన్న జపాలీ తీర్థానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. జపాలీ తీర్థంతో పాటు తితిదే ఆధ్వర్యంలో కూడా హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయం వెనుక ఉన్న పగడ హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి విగ్రహానికి అభిషేకం చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్‌ రోడ్డులోని అతిపెద్ద హనుమాన్‌ విగ్రహానికి కూడా తితిదే ప్రత్యేక పూజలు నిర్వహించింది.