ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (20:12 IST)

ఏ రోజుల్లో తలస్నానం చేయకూడదో తెలుసా?

ఈరోజుల్లో ఎప్పుడుపడితే అప్పుడు తలస్నానం చేయడం అలవాటైపోయింది. కానీ అలా తలస్నానం చేస్తే పలు అనారోగ్య సమస్యలు వస్తాయన్నది ప్రాచీన శాస్త్రాల్లో చెప్పబడింది.
 
పాడ్యమినాడు రిక్తతిథుల్లో పున్నమి, అమావాస్య, చతుర్దశి, అష్టమి, షష్ఠి, ఏకాదశి ద్వాదశి, సప్తమి, త్రయోదశి, తదియ, నవమి తిథుల్లో సంక్రాంతినాళ్ళల్లో వ్యతిపాతాల్లో పితృకర్మలు చేయురోజుల్లో ఉపవాసం చేసేరోజుల్లో ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తైల మర్దనాన్ని శాస్త్రాలు నిషేధించినాయి. అంటే ఈ రోజుల్లో తలంటు పోసుకోరాదు. దానివల్ల సంపదలు తొలగిపోతాయి. ఆయుస్సు క్షీణించి పోతుంది.
 
అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, గ్రహణాలు ఇవన్నీ సంధికాలాలు సూర్యునికి భూమికిగల సంబంధంలో విషమత్వమేర్పడుతుంది. ఈ రోజుల్లో అభ్యంగనస్నానం చేయకూడదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.