శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 17 ఏప్రియల్ 2019 (22:17 IST)

బలమే జీవితం, దౌర్బల్యమే మృత్యువు

1. వేచి ఉండు. ప్రయోజనకారి అయ్యేది డబ్బుకాదు, పేరు కాదు, కీర్తి కాదు, పాండిత్యం కాదు. ప్రయోజనకారి అయ్యేది ఒక్క ప్రేమే. దుర్బేద్యాలైన గోడల లాంటి కష్టాలను ఛేదించగలిగేది ఒక్క సౌశీల్యమే.
 
2. బలమే జీవితం, దౌర్బల్యమే మృత్యువు. బలమే ఆనందమయమైన, అమరమైన, అనంతమైన జీవితం. దౌర్బల్యం నిరంతర శ్రమ,దుఃఖం. దౌర్బల్యమే మృత్యువు.
 
3. దైవ చింతనతో గడుపుతున్న జీవితం స్వల్పకాలమైనా ఉత్తమమైనదే. దైవ భక్తి లేని జీవి లక్షలాది సంవత్సరాలు బ్రతికి ఉన్న ప్రయోజనం శూన్యమే.
 
4. కష్టపడి పనిచేయి. దేవుడు నామము ఉచ్చరించు. సద్గ్రంధాలు చదువు. వంతులకు, పోటీలకు పోవద్దు. అలా చేస్తే  భగవంతునికి   ఏహ్యం కలుగుతుంది.
 
5. మన సంభాషణ యందు మనం సత్యాన్ని ఆచితూచి పలకాలి. సాధకుడు మితభాషిగా ఉండాలి. 
 
6. దైవాన్ని మరచిన వారికి బలహీనత కలుగుతుంది. పరమేశ్వరుని జ్ఞాపకముంచు కొనవలనంటే వాని మహిమను, నామాన్ని స్మరించడం అవసరం.
 
7. కష్టాలను అధిగమించితే మనకు నూతనుత్తేజం, ఆధ్యాత్మిక బలం చేకూరుతుంది.