శనివారం, 23 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 22 జనవరి 2019 (20:19 IST)

పని చేయడం నేర్చుకోవాలి, పెత్తనం కాదు...

1. ప్రేమ, అభిమానం ఉన్నచోట పేదరికం ఉండదు.
 
2. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారు చివరకు ఏ నీడ లేకుండా పోతారు.
 
3. వ్యక్తిని కన్నా వ్యక్తిత్వాన్ని ప్రేమించడంలోనే అందం, ఆనందం ఉన్నాయి. 
 
4. గొప్పగొప్ప వ్యక్తులు ఆశయాల కోసం జీవిస్తే, దుర్మార్గులు దురాశల కోసం జీవిస్తారు. 
 
5. మంచి ఆశయాలున్నంత మాత్రాన ఏ పనీ సిద్దించదు. దానికి తగ్గ కృషి, పట్టుదల ఉండాలి.
 
6. ఇవ్వడం నేర్చుకోవాలి, తీసుకోవడం కాదు- పని చేయడం నేర్చుకోవాలి, పెత్తనం కాదు.
 
7. బుద్ధిని స్థిరంగా, సక్రమమైన మార్గంలో నిలపగలిగిన వాడే ఆదర్శ మానవుడవుతాడు.
 
8. మంచి ఆలోచన మంచి పనికి దారితీస్తుంది.
 
9. భోగాలు పెరిగితే, రోగాలు పెరిగి కన్నీరు కార్చక తప్పదు. మితంగా, హితంగా, ప్రియంగా మాట్లాడాలి.
 
10. విజయాన్ని ఎలా సాధించాలో ఓటమిని చూసి నేర్చుకోవాలి. మన సుఖసంతోషాలను ఎదుటివారితో పంచుకోవాలి.