శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2017 (14:52 IST)

కాలసర్ప దోషం అంటే ఏంటి? ఈ దోషం ఉంటే కలిగే లాభాలేంటి?

హిందువులకు ఉండే భక్తి విశ్వాసాలతో పాటు మూఢ నమ్మకాలు అధికం. ఇలాంటి వాటిలో జ్యోతిష్యం ఒకటి. కేవలం వ్యక్తిగత దిన, వార, మాస ఫలితాలే కాదు వధూవరుల వివాహాలకు కూడా జాతకాలు చూస్తుంటారు. వారి పేరుబలాలకు తగినవిధ

హిందువులకు ఉండే భక్తి విశ్వాసాలతో పాటు మూఢ నమ్మకాలు అధికం. ఇలాంటి వాటిలో జ్యోతిష్యం ఒకటి. కేవలం వ్యక్తిగత దిన, వార, మాస ఫలితాలే కాదు వధూవరుల వివాహాలకు కూడా జాతకాలు చూస్తుంటారు. వారి పేరుబలాలకు తగినవిధంగానే ముహుర్తాలు ఖరారు చేస్తుంటారు. అయితే, చాలా మంది జాతకాల్లో కాలసర్ప దోషం అనేది ఉంటుంది. ఇది ఉన్నవారు భయంతో వణికిపోతారు. తమకు అంతా చెడు జరుగుతుందని గుడ్డిగా నమ్మేసి పూజలు చేస్తూ శాంతి హోమాలు జరిపిస్తుంటారు. అయితే, ఈ దోషం వల్ల కేవలం చెడు ఫలితాలే కాదు... అపుడప్పుడూ మంచి ఫలితాలు కూడా కలుగుతాయట. అవేంటో ఓ లుక్కేద్దాం. 
 
మొత్తం నవగ్రహ కూటమిలో రాహు, కేతువులే కాకుండా, మిగిలిన 7 గ్రహాలన్నీ ఆ రెండు గ్రహాల చట్రంలో ఇరుక్కుపోతే దాంతోపాటు కాలసర్ప దోషం వస్తుంది. ఆ సమయంలో జన్మించిన వారికే మాత్రమే కాలసర్ప దోషం వస్తుంది. అయితే, ఈ దోషం వల్ల అంతా అశుభమే జరుగుతుందని భావించరాదు. కొన్ని మంచి దోషాలు కూడా ఉంటాయి.
 
కాలసర్ప దోషంలో జన్మించిన కోటానుకోట్ల మందిలో జవహర్‌లాల్ నెహ్రూ, ధీరుభాయ్ అంబానీ, సచిన్ టెండూల్కర్ వంటి మహామహులు కూడా ఉన్నారు. వీరు తమకు నచ్చిన రంగాల్లో అద్భుతంగా రాణించి కేవలం వ్యక్తిగతంగానే కాకుండా దేశానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. కీర్తినీ గడించారు. కాలసర్ప దోషంలో జన్మించినా నిరంతరం శ్రమించేవారిపై ఈ దోషం ఎలాంటి ప్రభావం చూపదని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు. 
 
ఈ దోషంతో ఉన్నవారికి గ్రహాలు అనుకూలిస్తే కేవలం ఆర్థికంగానే కాకుండా అన్ని రంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తారట. కాలసర్ప దోషం ఉన్నవారి జాతక చక్రంలో బృహస్పతి ఉచ్ఛ స్థానంలో ఉన్నా లేదంటే రాహువుతో కలిసివున్నా అలాంటి వారి దశ తిరిగిపోతుందట. అలాంటి వారు అత్యుత్తమ ప్రతిభావంతులు అవుతారట. ఇలా అనేక విధాలుగా మంచి కూడా జరుగుతుందట.