ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (21:40 IST)

బ్రహ్మదేవుడు 5 ముఖాలు కలవాడు... మరి చతుర్ముఖుడు ఎలా అయ్యాడు?

బ్రహ్మదేవుడికి 5 ముఖాలు ఉండేవి. బ్రహ్మ విష్ణువు ఇరువురిలో ఎవరు గొప్పవారు అనే సంవాదం వచ్చినప్పుడు శివుడు లింగాకారం ధరించి విష్ణువుని తన మూలం చూసి రమ్మని, బ్రహ్మను తన అగ్ర భాగం చూసి రమ్మని చెప్పాడు. విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళి లింగమూలం చూడలేక తిరిగి వచ్చి శివుడికి నిజం చెప్పాడు. బ్రహ్మ హంస రూపుడై పైకి పోయి అగ్రభాగం చూడకున్నా చూసానని అబద్దం చెప్పాడు. 
 
అసత్య దోషం వల్ల అతని ముఖం ఒకటి గాడిద ముఖంగా మారిపోయింది. బ్రహ్మ తాను అధికుడునని గర్వంచినందుకు, గర్వం తగదని శివుడు చెప్పినా వినలేదు. పైగా తన గాడిద ముఖంతో శివుణ్ణి తీవ్రంగా దూషించాడు. శివుడు కాలభైరవుణ్ణి సృష్టించి తనను దూషించిన బ్రహ్మ శిరస్సును ఖండించమన్నాడు.
 
బైరవుడు శివుని ఆదేశం మేరకు ఆ తలను ఖండించాడు. అలా ఖండింపబడిన బ్రహ్మ శిరస్సుకు చెందిన కపాలం చేతబట్టి శివుడు భిక్షాటనం చేస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అలా బ్రహ్మ దేవుడు చతుర్ముఖుడు అయ్యాడు.