శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 12 మే 2018 (14:43 IST)

పాశుర ప్రభావం గురించి? ఎందుకు?

జీవితంలో స్తబ్దత నెలకొన్నపుడు తన గత వైభావాన్నీ, గడచిన మంచి రోజులనూ, భగవంతుని దయవలన గట్టెక్కిన సందర్భాలను తలచుకొని ఆంతరంగిక సంతృప్తి చెందాలి.

జీవితంలో స్తబ్దత నెలకొన్నపుడు తన గత వైభావాన్నీ, గడచిన మంచి రోజులనూ, భగవంతుని దయవలన గట్టెక్కిన సందర్భాలను తలచుకొని ఆంతరంగిక సంతృప్తి చెందాలి.


 
పుళ్ళిన్‌వాయ్ కీణ్డానైప్పొల్లా వరక్కపై,
క్కిళ్లిక్కళైన్దానై క్కీరిమై పాడిప్పొయే
ప్పిళ్లైగ ళెల్లారుమ్ పాలైక్కళమ్బుక్కార్
వెళ్ళి యెళున్దు వియాళ మురణ్గిత్తు.
పుళ్ళుమ్ శిలుమ్బినగాణ్ పోదరికణ్ణినాయ్.
క్కుళ్ళక్కుళి రక్కుడైన్దు నీరాడాదే, 
పళ్ళిక్కిడత్తియో పావాయ్ నీనన్నాళాల్
కళ్ళమ్ తవిర్‌ను కలన్దేలో రెమ్బావాయ్.
 
భావం: భక్తజన సంరక్షణోద్యోగమే కర్తవ్యంగా గల శ్రీమహావిష్ణువు అవతార పర్వంలో బకాసురుని చీల్చి మనల్నీ, తననూ కాపాడుకున్న శ్రీరాముడు, రావణాసురని పది తలల దర్బాన్ని నేల రాల్చిన శ్రీరాముడు వీరచరితాఘనులు. ఆచంద్రతారార్కులు. సదా వీరి వీరగాథలను కీర్తిస్తూ ధైర్యాన్ని పొందుతుండాలి. బృహస్పతి అస్తమించాకా శుక్ర నక్షత్రం ఉదయిస్తుంది. 
 
భగవంతుని సేవించే శుభసమయం ఆసన్నమయింది. కృష్ణుని భక్తిరసంలో తరించేందుకు సఖులందరూ ఏకమయ్యారు. నిద్ర మేల్కొని, స్నానమాచరించి పూజకు మంచిరోజున కపటం విడిచి సహృదయంతో కలిసి ఆనందాన్ని అనుభవించు అంటూ గోదాదేవి ప్రార్థిస్తుంది. తిరుప్పావైలోని ఓ పాసురంలో ఆండాల్ (గోదాదేవి) పేర్కొంది. ఈ పాసురం ద్వారా దైవపూజకు సూర్యోదయం సరైన సమయమని.. సూర్యుడు ఉదయించేందుకు ముందే లేచి పూజకు ఆసన్నం కావాలని పేర్కొంది.