శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 13 నవంబరు 2018 (20:09 IST)

శనిదేవుడంటే భయమెందుకు? ఇలా చేస్తే దోషాలు పోతాయి...

జీవితం కష్టనష్టాలను మానసికంగాను, శారీరకంగాను వాటిని ఎదుర్కునే విధంగా చేయడంలో శనిదేవుడు ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాడు. ఇలాంటి బాధలను తట్టుకోవడం అంతతేలికైన విషయం కాదు. అందువలనే ఎంతటివారైనా శనిదేవుని పేరు వినడానికి కూడా భయపడుతుంటారు. అయితే ఆయన మాత్రం తాను అనుకున్న పనిని పూర్తిచేసుకుంటుంటాడు.
 
తన అనుగ్రహాన్ని ఆశించిన వారిపై నుండి తన ప్రభావాన్ని తగ్గిస్తూ వెళుతాడు. శని దోషం బారిన పడినవాళ్లు ఆయనను శాంతింపజేసి ఆయన అనుగ్రహాన్ని పొందడం మినహా మరోమార్గం లేదు. శని దోషాల నుండి బయటపడి పూర్వ స్థితికి చేరుకోవాలంటే అది శని దేవునిని కరుణాకటాక్షాలతోనే సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో శని అనుగ్రహాన్ని పొందే వివిధ మార్గాలలో పువ్వులు కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడింది.  
 
శనిదేవునికి నీలం రంగు, నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్పబడుతోంది. శనిత్రయోదశి రోజున ఈ పువ్వులతో పూజించడం వలన ఆయన ప్రసన్నుడవుతాడు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శనిదోష నివారణ జరిగిపోతుంది. రకరకాల సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. శనివారం ఉదయాన్నే శనిదేవుడికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు, బెల్లం కలిపి ముద్దలా చేసి ప్రసాదంలా పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి.