దేవతలకు ఏయే సమయాల్లో పూజ చేయాలి?
దేవతా పూజలు ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు. ప్రభాతకాలం, మధ్యాహ్న, సాయంకాలాలలో ప్రశాంత మనస్కులమై, శుచిగా పరమాత్మను పూజించాలి. దీన్ని బాహ్యపూజగా పరిగణిస్తారు. ఇది లోనికి మళ్లితే మానసిక పూజగా మారుతుంది. దానికి సమయాలుండవు.

చివరకు "యద్యత్ కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్" అన్నట్లు ఏ పని చేసినా పూజయన్న భావం స్థిరపడాలి. అట్లే జపం కూడా. ప్రారంభంలో ఈ జపం మూల కూర్చుని, మూలపట్టుకుని జపం చేస్తూ చేస్తూ చివరకు మూల, మాలలు వదిలి మనలో నిరంతరమూ జపం కొనసాగే స్థితికి చేరుకోవాలి. దానికే "అజపాజపస్థితి" అని పిలుస్తారు.
అలాగే భగవంతునికి మనము అర్పించవలసినవి పదార్థాలు కావు. మనలోని ఆహంకారాలు, కామనలు వంటివే. అలాగే హారతులంటే కేవలం కర్పూరం వెలిగించడమే కాదు.
మనలోని అహంకారాన్ని కర్పూరంలా వెలిగించి, పరమాత్మకు సమర్పించడం, పుష్పం సమర్పయామి అని పువ్వులకు మనలోని దుర్వాసనలను పట్టించి స్వామి పాదాల మీద సమర్పిస్తే ఆ పాదాలు ఆ దుర్వాసనలను శుద్ధం చేసి మళ్లీ మనకిస్తే వాటిని శిరస్సున ధరిస్తామని పురోహితులు చెబుతున్నారు.