గురువారం, 7 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2024 (13:32 IST)

సంకష్టహర చతుర్థి పూజలో గరిక తప్పనిసరి.. అప్పులు పరార్

lord vinayaka
సంకష్టహర చతుర్థి అయిన ఈ రోజున విఘ్నేశ్వరుడిని పూజించే వారికి సకలసంపదలు చేకూరుతాయి. ఇంకా సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడికి గరికతో పూజ, గరిక మాల సమర్పించే వారికి ఈతిబాధలంటూ వుండవు. 
 
గరికను సంకష్టహర చతుర్థి రోజు ఆయనకు సమర్పించడం ద్వారా ఈతిబాధలు, అడ్డంకులు, అప్పుల బాధలు తొలగిపోతాయి. గరిక లేనిదే వినాయక పూజ చేయకూడదు. అలాగే సంకష్టహర చతుర్థి రోజున ఆలయాల్లో విశేష తీర్థాన్ని భక్తులకు ఇస్తారు. 
 
ఈ తీర్థంలో గరిక, పచ్చకర్పూరం, ఏలకులు, జాజికాయను వేస్తారు. ఈ తీర్థాన్ని సేవించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఇంకా సకల దోషాలు తొలగిపోతాయి. జీవితంలో సుఖం చేకూరుతుంది.