శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 31 డిశెంబరు 2019 (21:15 IST)

అందుకే నేను విభూతి ఇస్తాను: షిర్డి సాయిబాబా

శిరిడీలో భక్తులు నివశిస్తున్నప్పుడు సాయిబాబా ఎవరికీ ఊదీ ఇచ్చేవారు కాదు. ఐతే విభూతి ఇస్తున్నప్పుడు మాత్రం ఈ విశ్వమంతా భస్మంలా అశాశ్వతమని గ్రహించండి అని సూచించేవారు. ఆ కట్టెల మాదిరిగానే ఈ శరీరం కూడా. ఈ దేహం పంచభూత నిర్మితం అయిున్నంత వరకూ ఇది వుంటుంది. 
 
ఆయువు తీరగానే ఇది శవమైపోతుంది. కాలి బూడిదవుతుంది. నేనూ, మీరూ అందరం కూడా ఈ స్థితికి చేరుకుంటాం. మీరంతా దీనిని జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టే నేను విభూతి ఇస్తాను. బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య. ఈ అర్థాన్నే విభూతి బోధిస్తూ వుంటుంది. అహర్నిశలు దీనిని స్మరిస్తూ వుండాలి. 
 
ఈ లోకంలో ఎవరికీ ఏమీ కారు. నగ్నంగా వచ్చావు నగ్నంగానే వెళతావు. ఈ సత్యాన్నే ఊదీ తెలియజేస్తుంది. ఈ ఊదీ వివేక పూర్ణ వైరాగ్యాన్ని కలిగి వుండమని సూచిస్తుంది. వీలయినంత ఎక్కువగా దక్షిణ ఇవ్వడం వల్ల మనిషిలో వైరాగ్య లక్షణం వృద్ధి చెందుతుంది. తర్వాత, తర్వాత క్రమంగా అతనికి వైరాగ్యం వంటబడుతుంది. ఒకరికి వైరాగ్యం ఏర్పడినా, అది వివేకయుక్తం కాకపోతే, ఆ వైరాగ్యం వ్యర్థ అవుతుంది. కాబట్టి విభూతిని ఆదరించాలి.