సాయిబాబాను ప్రార్థించినా పలకలేదు
ఒకప్పుడు ఓ అంధుడు తనకు దృష్టి ప్రసాదించమని ఎంత ప్రార్థించినా బాబా పలకలేదు. అతడు ఖండోబా ఆలయంలో ఉపాసనీ బాబాను దర్శిస్తే ఆయన.. ఈ వయస్సులో దృష్టి వస్తే కోర్కెలు హెచ్చుతాయి. జ్ఞానం కోరుకో అన్నారు.
అతడు మశీదు చేరి జ్ఞానం ఇమ్మని సాయిని కోరినపుడు, అతడిని శిరిడీలో వుండమన్నారు. నెలరోజుల లోగా అతడు గొప్ప ఆధ్యాత్మిక పరిణతి చెంది ఆ క్షేత్రంలోనే మరణించాడు. మరణించినది అతని భార్యే(అజ్ఞానం) కానీ అతడు కాదు. అతడు సద్గతి పొందాడు అన్నారు బాబా.