మంగళవారం, 20 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 4 ఏప్రియల్ 2022 (22:08 IST)

నేను తీసుకున్నదానికి పదిరెట్లు ఇస్తాను: షిర్డి సాయిబాబా

saibaba
నేను సాక్షిని మాత్రమే. చేయువాడు, చేయుంచువాడు భగవంతుడే. నేను ఒక రూపాయి దక్షిణ ఎవరి దగ్గరైనా తీసికొనినచో తిరిగి దానికి పదిరెట్లు వారికి ఇవ్వవలెను. ఇది నా నియమము. 

 
నేను సర్వస్వతంత్రుడను. నాకేమీ అక్కర్లేదు. నేను నా మాట ఎప్పుడు తప్పను. నాకు పూర్తి శరణాగతులై ఎప్పుడూ నన్నే ఎవరు గుర్తుంచుకుంటారో వారికి నేను రుణస్తుడను- అట్టివారికి నేను ముక్తిని ప్రసాదించి రుణవిముక్తి పొందగలరు.

 
నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీవు నన్ను తలచి చేయి చాచినచో విభూతి ప్రసాదము నీ చేతిలోకి వచ్చును.

 
నీవు సాయిరాం, సాయిరాం అనే మంత్రాలను జపించిన, మనశ్శాంతిని పొంది జీవిత లక్ష్యమును సాధించగలవు.