మంగళవారం, 27 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 2 ఏప్రియల్ 2022 (18:23 IST)

సంతానలేమి- వివాహం ఆలస్యం: ఈ క్షేత్రాలను దర్శిస్తే ఫలితం

బిక్కవోలు, మోపిదేవి, నాగులపాడు, నవులూరు పుట్ట, పెదకూరపాడు, పొన్నూరు పుట్ట మొదలైన సుబ్రహ్మణ్య క్షేత్రాలలో భార్యాభర్తలు నిద్ర చేయాలి. ఇలా చేసినట్లయితే సంతానలేమి సమస్య తొలగుతుందని నమ్మకం.

 
తెల్లవారు జామున పుణ్యస్నానం చేసి తడిబట్టలతో సుబ్రహ్మణ్య ఆలయానికి 70 ప్రదక్షిణాలను భార్యాభర్తలు 7 ఆదివారాలు చేసినట్లయితే సంతానలేమి సమస్య పరిష్కారమవుతుందని విశ్వాసం.

 
కృష్ణాజిల్లాలోని మోపిదేవి క్షేత్రంలో వెండి నాగప్రతిమలను దానము చేసినట్లయితే దోష పరిహారం జరుగుతుందనే విశ్వాసం వుంది. అలాగే 70 సార్లు కుజ శ్లోక పారాయణం చేయడం వల్ల సమస్యల నుంచి గట్టెక్కవచ్చని నమ్మకం.

 
కుజ, రాహు, కేతు గ్రహాలకు విడివిడిగా గ్రహ జపాలు చేయించి దానం చేస్తే వివాహం ఆలస్యం కావడం అనేది పరిష్కారమవుతుంది. అలాగే సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు ఆ సమస్య తొలగుతుందనే విశ్వాసం వుంది.