1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (11:29 IST)

స్కంధ షష్టి నాడు పుట్టకు పాలు పోస్తే..?

Nagamma
స్కంధ షష్టి నాడు షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఈ దినమంతా ఉపవాస వ్రతం పాటించాలి. అంతేకాకుండా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారిని సర్పంగా కూడా ఆరాధిస్తూ ఉండడం ఆచారం. 
 
కనుక పుట్ట వద్దకు వెళ్ళి పూజ చేసి పుట్టలో పాలుపోయడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. దీనికి తోడు గ్రహదోషాలతో బాధపడేవారు ముఖ్యంగా రాహు, కేతు, సర్ప, కుజదోషములున్న వారు కఠినమైన ఉపవాసం ఉండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చును. 
 
అలాగే ఈరోజు బ్రాహ్మణ బ్రహ్మచారిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి రూపంగా భావించి పూజించి పులగం, క్షీరాన్నం వంటి వంటలను చేసి భోజనం పెట్టి, దక్షిణలను తాంబూలను ఉంచి ఇచ్చి నమస్కరించాలి. ఈ విధంగా చేయడం వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి. వీటికి తోడు ఈరోజు "శరవణభవ" అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. స్కంధ షష్టి రోజున కుమార స్వామిని పూజించడం ద్వారా వంశాభివృద్ధి, సంపదలు, కీర్తి ప్రతిష్ఠలు పొందవచ్చు.