శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 20 అక్టోబరు 2017 (21:20 IST)

శుక్రవారం అభ్యంగన స్నానం చేస్తే...?

అభ్యంగన స్నానం అంటే ఏమిటి... దాన్ని ఎలా చేయాలి... ఎప్పుడు చేయాలో చాలామందికి తెలియదు. పూర్వకాలంలో ఒళ్లంతా నూనెలు రాసుకుని, మర్ధన చేసుకుని, నూనె శరీరంలో ఇంకిపోయేంత వరకు ఆరబెట్టుకుని పెద్దకాగుతో కాచిన వేడినీళ్లతో చక్కగా స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అ

అభ్యంగన స్నానం అంటే ఏమిటి... దాన్ని ఎలా చేయాలి... ఎప్పుడు చేయాలో చాలామందికి తెలియదు. పూర్వకాలంలో ఒళ్లంతా నూనెలు రాసుకుని, మర్ధన చేసుకుని, నూనె శరీరంలో ఇంకిపోయేంత వరకు ఆరబెట్టుకుని పెద్దకాగుతో కాచిన వేడినీళ్లతో చక్కగా స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అనేవారు. ప్రస్తుత ఆధునిక కాలంలో అవి దూరమయ్యాయి. ఎప్పుడో శుభకార్యాల సమయాల్లో మాత్రమే వీటిని పాటిస్తున్నారు. 
 
వారానికి ఓసారి తప్పకుండా అభ్యంగన స్నానాలు చేయడం మంచిదని వైద్యులు కూడా సలహాలు ఇస్తున్నారు. వెచ్చని నూనెతో మర్ధన చేసుకుని తలంటుకునే ఈ అభ్యంగన స్నానాలను కొంతమంది మాత్రం పాటిస్తూనే ఉన్నారు. అయితే ఈ అభ్యంగన స్నానాలు చేసేటప్పుడు కొన్నినియమాలు పాటించాల్సి ఉంటుంది. వారాలను చూసుకుని, తెలుసుకుని చేయడం ద్వారా శుభాలు జరుగుతాయని విశ్వాసం.
 
సోమవారం ఈ స్నానాలు చేయడం ద్వారా ఇంట్లో కొత్త వస్తువులు చేరతాయి. మంగళవారం మాత్రం ఇలాంటివి మంచివి కావు. మంగళవారం స్నానాలు చేయడం ద్వారా ఇంటికి అరిష్టాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అలాగే బుధవారం నాడు ఈ అభ్యంగన స్నానాలు చేయడం ద్వారా విద్యాభివృద్ధి జరుగుతుంది. గురువారం అభ్యంగన స్నానాలతో మేధస్సు పెరుగుతుంది.
 
శుక్రవారం ఈ అభ్యంగన స్నానాలు చేయడంతో పేరుప్రతిష్టలు కలుగుతాయి. శనివారం ఈ స్నానాలు చేయడం ద్వారా సకల సంపదలు ప్రాప్తిస్తాయి. ఆదివారం ఈ స్నానాలు చేయడంతో సౌందర్యం నశిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అభ్యంగన స్నానానికి ఎలాంటి ఫలితాలుంటాయో తెలిసింది కదా.