1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 29 డిశెంబరు 2016 (14:03 IST)

శ్రీ రామానుజాచార్యులకు బ్లూమింగ్‌టన్ నగరంలో అరుదైన గౌరవం

బ్లూమింగ్‌టన్, USA: అమెరికాలోని బ్లూమింగ్‌టన్ నగరంలో భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది సందర్భంగా రామానుజాచార్యుల వారికి అరుదైన గౌరవం లభించింది. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చినజియార్ స్వామిజి బ్లూమింగ్‌టన్ నగర పర్యటనకు వచ్చిన సందర్భంగా, నగర మేయర్ త

బ్లూమింగ్‌టన్, USA: అమెరికాలోని బ్లూమింగ్‌టన్ నగరంలో భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది సందర్భంగా రామానుజాచార్యుల వారికి అరుదైన గౌరవం లభించింది. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చినజియార్ స్వామిజి బ్లూమింగ్‌టన్ నగర పర్యటనకు వచ్చిన సందర్భంగా, నగర మేయర్ తరిరెన్నెర్ రామానుజ సహస్రాబ్ది సందర్భంగా హైదరాబాద్‌లో నిర్మాణమవుతున్న 216 అడుగుల "స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ"ని పురస్కరించుకుని నగర మేయర్ 28 డిసెంబర్ 2016ని "డే ఆఫ్ ఈక్వాలిటీ"(సమతా దినోత్సవం)గా ప్రకటన చేస్తూ తత్సంబంధమైన అధికారిక ప్రకటనా పత్రాన్ని నగర మేయర్ రెన్నెర్ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చినజియార్ స్వామిజి వారికి అందజేశారు. 
 
శ్రీ రామానుజాచార్యుల వారికి బ్లూమింగ్‌టన్ నగర ప్రజలు అందించిన అరుదైన గౌరవానికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చినజియార్ స్వామిజి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గజల్ గాయకులు, ట్రిపుల్ గిన్నీస్ వరల్డ్ రికార్డు గ్రహీత 'మాస్ట్రో' డా. గజల్ శ్రీనివాస్, ప్రముఖ సంఘ సేవకులు శ్రీ మండవ వెంకటేశ్వరరావు, హిందూ స్వయం సేవక్ సంఘ కన్వీనర్ శ్రీ మురళి పాల్గొన్నారు.