శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (13:01 IST)

అమరావతిలో భారీ శ్రీవారి ఆలయం.. కశ్యప శిల్పాశాస్త్రంలోని?

అమరావతిలో భారీ శ్రీవారి ఆలయానికి నేడు అంకురార్పణ జరగనుంది. దీని కోసం ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి 25 ఎకరాల భూమిని కేటాయించడం కూడా జరిగింది. జనవరి 31న చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి ఫిబ్రవరి 10న భూమిపూజ జరగనుంది.
 
ఆలయాన్ని తిరుమల ఆలయ శోభను ప్రతిబింబించేలా రెండు ప్రాకారాలతో, లోపలి భాగం అంతా శ్రీవారి ఆలయ తరహాలోనే పూర్తిగా రాతితోనే నిర్మించాలని తితిదే సంకల్పించింది. ఈ ఆలయ నిర్మాణాన్ని వచ్చే మార్చి నాటికి నాలుగు దశల్లో పూర్తి చేయాలని, దీన్ని 150 కోట్ల రూపాయలతో నిర్మించాలని పాలకమండలి తీర్మానించింది.
 
ఈ ఆలయాన్ని చోళులు చాళక్యుల కాలం నాటి వాస్తు శైలిలో నిర్మించాలని, ఇందుకోసం కాంచీపురం, తంజావూరు, బాదామీ, హంపీ ఆలయాల నిర్మాణ శైలులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కశ్యప శిల్పాశాస్త్రంలోని విమానార్చన కల్పంలో పేర్కొన్న విధంగా ఆగమబద్ధంగా నిర్మిస్తారు.