1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 29 జూన్ 2022 (23:09 IST)

షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము

saibaba
జై సాయిమహరాజ్... షిర్డీ సాయినాధును చేరినంతనే సర్వదుఃఖ పరిహారం జరుగుతుందని సాక్షాత్ సాయినాథుడే చెప్పాడు. ఆయన చెప్పిన ఏకాదశ సూత్రాలు ఇవే.

 
షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.
అర్హులైన నేమి నిరుపేదలైన నేమి ద్వారకామాయి ప్రవేశించినంతటనే సుఖ సంపదలు పొందగలరు.
ఈ భౌతిక దేహానంతరం నేను అప్రమత్తుడనే. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండే వెలువడుతుంది.
నా సమాధి నుంచే నా మనుష్య శరీరం మాట్లాడుతుంది.
నన్ను ఆశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
నాయందు ఎవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము.
మీ భారాలను నాపై పడవేయండి, నేను మోస్తాను.
నా సహాయంగాని, నా సలహాగానీ, కోరిన తక్షణము ఒసగేందుకు సంసిద్ధుడుగా వుంటాను.
నా భక్తుల ఇంట లేమి అనే శబ్దమే వుండదు.
నా సమాధి నుంచే నేను సర్వకార్యములు నిర్వహిస్తాను.