గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 5 మార్చి 2022 (23:26 IST)

మానవడు మొక్కులు చెల్లించి తీరాలి, లేకుంటా బాధలొస్తాయి తప్పదు...

షిర్డీ సాయి విశ్వాసం లేనివారిని కూడా కష్టాలలో రక్షించి, భక్తిని ప్రసాదించి తర్వాత తమ సేవలోనే భుక్తి, ముక్తి ప్రసాదిస్తారు. మహల్సాపతి బంగారుపని, తరతరాలుగా వంశాచారంగా వస్తున్న ఖండోబా ఆలయంలో అర్చకత్వం చేసేవాడు. సాయి అతని చేత బంగారు పని మాన్పించి అర్చకత్వము, భిక్ష చేయించారు. అలా సాయిబాబా తన సద్భక్తుని ఉద్ధరిస్తాడు. ఐతే ఎక్కువమందికి అంత స్థిరమైన మనసుండదు.

 
కనుక సాయి వంటి సద్గురు సేవ దొరికినా కొంతకాలమయ్యాక దానిని వదలి ఆయన పట్ల వున్న శ్రద్ధ కోల్పోతారు. సద్గురువు ఎవరినీ వారి శక్తికి మించి ఆత్మపథంలోకి లాగరు. అనివార్యంగా అనుభవించాల్సిన కర్మఫలాన్ని సాధనంగా చేసుకుని వాళ్ల పరిపాకాన్ని పెంచుతారు. అవసరమైన దానినే తమ మందలింపుగా వినియోగిస్తారు.

 
ఒక ఉదాహరణలో ప్రధానమైన ఆధ్యాత్మ జీవిత సూత్రాలన్నీ సాయి తెలిపారు. పూనాలో 1914లో ప్లేగు వ్యాధి చెలరేగింది. దూబే అనే భక్తుడు భయంతో శిరిడీ వస్తానని మొక్కుకున్నాడు. కానీ తర్వాత మనసు మార్చుకుని సకుటుంబంగా సాసర్ వాడ్ వెళ్లాడు. అక్కడ అతని పసిబిడ్డ ఆ వ్యాధితో మరణించింది. అతని భార్య కూడా తీవ్రంగా జబ్బు పడింది. నాటి రాత్రి సాయిబాబా దూబెకి స్వప్నదర్శనమిచ్చారు. మానవుడు మొక్కులు చెల్లించి తీరాలి. లేకుంటే యిలా బాధలొస్తాయి అని చెప్పి అతని భార్యకు నుదుట విభూతి చూచి ఆశ్చర్యపోయాడు.