1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (16:16 IST)

అశ్వత్థ వృక్షం(రావిచెట్టు) ఎంతో పవిత్రమైనదంటారు, ఎందుకు?

పూర్వం నరసింహ స్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినపుడు ఆ రాక్షసుడి కడుపులో వున్న దుష్ట రక్తం స్వామి చేతిగోళ్లకు అంటుకుంది. దాంతో స్వామివారి గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ, ఆకులతోను ఆ బాధ నివారింపజేసింది.

 
అందుకు స్వామివారు సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించినవారికి విషబాధ తొలగు గాక, నిన్ను పూజించినవారి పాపాలు నశించి, అభీష్టాలు నెరవేరుతాయి. నీ నీడన చేసిన జపధ్యానాదులకు అపారమైన ఫలితం వుంటుంది. మేమిద్దరం నీ యందు నివశిస్తాము అని వరమిచ్చాడు.

 
ఆ వరాన్ని అనుసరించి భగవంతుడైన శ్రీ గురుడు ఆ చెట్టు క్రింద నివశించారు. నేటికీ ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివశిస్తుంటారు.