గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (18:17 IST)

కష్టాల్ని భరించే శక్తి గణించలేనంత గొప్పది (video)

ధృడసంకల్పం, పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలను ఇస్తాయి. వీటిని ఆయుధాలుగా గ్రహించిన వారు కొద్దిమందే అయినా, అన్ని విఘ్నాలను ఎదుర్కొని నిలువగలుగుతారు.
 
కార్యశక్తి కంటే, కష్టాల్ని భరించే శక్తి గణించలేనంత గొప్పది. ద్వేషానికి ఉన్న శక్తి కంటే ప్రేమకు ఉన్న శక్తి అనంత రెట్లు ప్రభావశీలమైనది.
 
మీరందరు ఒకప్పటి వేదఋషులు. ఇప్పుడు మీరు వేరు రూపాలలో వచ్చారు. అంతే తేడా... మీ అందరిలో అనంత శక్తి ఉంది. పగటి వేళ కాంతిలాగా ఈ విషయాన్ని స్పష్టంగా చూస్తున్నాను. ఈ శక్తిని జాగృతం చేయండి. మేల్కోండి.
 
ప్రతి సుఖం తరువాత దుఃఖం వస్తుంది. వాటి మధ్య అంతరం ఎక్కువ లేక తక్కువ ఉండవచ్చు. వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా సుఖదుఃఖాలు ఒకదాన్ని మరొకటి అనుసరిస్తాయి.
 
నీలో అనంతశక్తి ఉందని విశ్వాసం కలిగి ఉండు. జాగరూకుడవై ఆ శక్తిని వ్యక్తపరచు. నేను ఏదైనా సాధించగలను అని సంకల్పించు. పాము విషం కూడా గట్టిగా తిరస్కరిస్తే మీ పట్ల నిర్వీర్యమైపోతుంది. జాగ్రత్త.... చేయలేను అని అనవద్దు. ప్రతికూల భావనలు రాకూడదు.
 
ఆత్మ విశ్వాసం కలిగి ఉండండి. గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి.