గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 9 ఏప్రియల్ 2020 (23:20 IST)

ధ్యానమార్గంలో నిమగ్నమైన వారికి అదో సమస్య కాదు

మనిషి పాకులాట దేనికోసం. లేచింది మొదలు ఏదో సాధించాలని ఆరాటపడేవాడు చివరకి అది లేకపోతే మాత్రం వుండలేడు. అన్నీ తెలుసుకున్న తర్వాత  అతడు అనుకునేదొక్కటే. సంపద అక్కరలేదు, నాకు నిద్ర కావాలి. అంటే ఇప్పుడు నీకు నిద్రే సంపద అయిందన్నమాట. 
 
ఒకసారి ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థులను ఈ క్రింది విధంగా ప్రశ్నించాడు. జీవితంలో యదార్థంగా సంభవించగలిగే వస్తువు ఏది కావాలో కోరుకోమని వరమడిగితే, ఏమని అడుగుతావు? అని. కొంతమంది కారు కావాలని, కొంతమంది లక్ష రూపాయలనీ, ఇలా మరికొంతమంది తమకేవి ఇష్టమో చెప్పారు. 
 
అందుకు అధ్యాపకుడు... ఓరి అభాగ్యులారా... ఎందుకు వీటిని కోరుకున్నారు? బుర్రలిమ్మని, మేధస్సునిమ్మని అడగాలి అని వారికి సూచించాడు. అందుకు బదులుగా ఒక విద్యార్థి లేచి, ఎవరైనా తమ దగ్గర ఏది లేదో అది అడుగుతారు కదా అని అన్నాడు. 
 
కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో కరువైంది నీ సంపద. నిద్ర గొప్ప సంపద. అదే గొప్ప సుఖం. ధ్యానమార్గంలో నిమగ్నమైన వారికి ఇది ఒక సమస్య కాదు. ధ్యానంలో నిమగ్నులు కండి. నిద్ర దానంతట అదే వస్తుంది.