మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (15:24 IST)

''చ్యవన మహర్షి'' గోవు గురించి ఏం చెప్పారో తెలుసా?

మహర్షులలో చ్యవన మహర్షికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మహర్షి నీటిలోనే ఎక్కువగా తపస్సు చేస్తుంటారు. ఓసారి కొంతమంది జాలరులు విసిరిన వలన చ్యవన మహర్షి పడిపోతాడు. మా అపరాధానికి మన్నించండి అంటూ జాలరులు కోరుతా

మహర్షులలో చ్యవన మహర్షికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మహర్షి నీటిలోనే ఎక్కువగా తపస్సు చేస్తుంటారు. ఓసారి కొంతమంది జాలరులు విసిరిన వలలో చ్యవన మహర్షి పడిపోతాడు. మా అపరాధానికి మన్నించండి అంటూ జాలరులు కోరుతారు. జాలరులను నిరాశ పరచకుండా వారికి ఏదైనా ఇవ్వమని రాజుకు చెబుతారు.
  
 
రాజుకు జాలరులకు ఏమివ్వాలో తెలియక గోవును ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. జాలరులకు సమానమైనది గోవేనని చ్యవన మహర్షి రాజును అభినందిస్తారు. గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారని, గోవును పూజించడం వలన ఈ దేవతలు అనుగ్రహం దక్కుతుందని మహర్షి జాలరులతో చెబుతారు. 
 
గోవును రక్షిస్తూ ఉంటే ఆ గోవే మిమ్ములను రక్షిస్తుందని తద్వారా ఎలాంటి సమస్యలు దరిచేరవని చ్యవన మహర్షి చెప్పారు. ఈ మాటలు విన్న జాలరులు సంతోషంతో వారి వెంట ఆ గోవును తీసుకెళ్ళారు.