పుస్తకాలను కాలితో తాకితే..?
పుస్తకాలు, గ్రంథాలను సరస్వతి దేవిగా ఎందుకు భావిస్తారో తెలుసుకుందాం.. పురాణ కాలం నుండే చదువులకు తల్లి సరస్వతి దేవి అని పేర్కొనబడింది. అమ్మవారి కటాక్షం ఉంటే చదువుల్లో రాణిస్తారని పెద్దల మాట. పుస్తకాలు దైవంతో సమానం. కానీ, చాలామంది తెలిసి తెలియక వాటిని కాలితో తొక్కుతుంటారు.
పుస్తక స్వరూపం తెలిసిన వారు కాలితో తాకినప్పుడు వెంటనే క్షమించమని మెుక్కుకుంటారు. దేవుళ్లకు పూజలు ఎంత ముఖ్యమో పుస్తకాలకు కూడా అంతే ప్రధాన్యత ఇవ్వాలని పండితులు చెప్తున్నారు.
భారతీయ సంప్రదాయంలో జ్ఞానమనేది పవిత్రమైనది, దైవ సమానమైనది. ఈ రెండింటి ద్వారా మనం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. అందుకనే వీటిని గౌరవభావంతో పవిత్రంగా చూస్తాం. 'విద్య వినయేన శోభతే' అంటే మనం ఎంత విద్యనార్జించిన అణుకువగా ఉండాలని దీని అర్థం. అలాంటివారికి వినయం మరింత శోభనిస్తుంది. అందుకనే సరస్వతి స్వరూపమైన పుస్తకాలు, గ్రంథాలను కాలితో తాకకూడదని చెప్తుంటారు.
పుస్తకాలు సరస్వతి స్వరూపమని తెలిసి కూడా చాలామంచి కాలితో తొక్కుకుంటారు. వాటిపైనే నడుస్తుంటారు. ఇలా చేస్తే పలురకాల సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెప్తున్నారు.