సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By
Last Updated : శనివారం, 10 నవంబరు 2018 (15:54 IST)

కార్తీక మాసంలో దీపాలు ఎలా వెలిగించాలంటే..?

దీపం అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి సంప్రదాయబద్దంగా పూజలు చేయడం ఆనవాయితి. సర్వసంపదలందించే లక్ష్మీదేవిని అనేక రూపాల్లో పూజిస్తుంటారు. ఆమె ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సర్వసంపదలు, సకలసౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. లక్ష్మీదేవిని అష్టలక్ష్మీ రూపాల్లో ఆరాధిస్తుంటారు. లక్ష్మీదేవికి గురు, శుక్రవారాలు చాలా ప్రీతికరమైనవి. ప్రతిరోజూ అమ్మవారిని ధ్యానిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.
 
నూనె, నిప్పు, వత్తి కలిస్తే దీపం అవుతుంది. మూడు విడివిడిగా ఉంటే మూడింటికి పరస్పరం విరోధమే. తైలానికి అగ్నితో, వత్తితో అలాగే అగ్నికి, వత్తికి కూడా విరోధం. మూడు కలిస్తేనే దాని ఉపయోగం. విడివిడిగా ఉండే ఈ మూడూ కలిసి ప్రమిదలో ఉన్నప్పుడు చుట్టూ ఎటు చూసినా కాంతిని నింపుతాయి.
 
సృష్టి.. దీనిలోని జీవకోటి రాజస, సాత్విక, తాపన గుణాలతో కూడినవి. ప్రమిదలో వత్తిలాంటిది సత్వగుణం. నూనె లాంటిది తమోగుణం. మంట లాంటిది సత్వగుణం, రజోగుణం. ఇవన్నీ ఒకటికొకటి గిట్టని గుణాలు. కాని మూడూ కలిస్తే కాంతి నిండుతుంది. మంచి మనిషిగా ఉండాలనుకున్న వారు రజస్, తమో గుణాలను అణచివేసి సత్త్వగుణం ఎక్కువగా అలవరుచుకోవాలి. 
 
అప్పుడే వ్యక్తి జీవితం కాంతివంతమవుతుంది. రాగద్వేషాల్ని ఎప్పటికప్పుడు వదిలించుకుంటే రజోగుణం నశిస్తుంది. ఉత్తముల సాంగత్యం వల్ల, శాస్త్రాల్లోని అనేకమైన విషయాలు తెలుసుకోవడం వల్ల సత్త్వగుణాన్ని పెంచుకోవచ్చు. అందువల్ల తమోగుణం నశిస్తుంది. ఇటువంటి జ్ఞానదీపాలే కావాలి.