బుధవారం, 28 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 20 మార్చి 2021 (22:54 IST)

అయోధ్య గురుంచి అద్భుత విషయాలు

రామనామ వరాననే... ఇదే తారక మంత్రం. ఈ మంత్రం చదువుతూ అయోధ్య నగరాన్ని దర్శించాలంటారు. అయోధ్యకు సాకేతమని పేరు. విష్ణుమూర్తి యొక్క ఏడవ అవతారం శ్రీరాముడు.
 
అయోధ్య నగరం 9000 సంవత్సరాల కాలం నాటిదని చారిత్రకుల అంచనా. సూర్యవంశీయుల తర్వాత, బౌద్ధులు, జైనులు, మహ్మదీయులు కొంతకాలం పాటించారు.
 
హిందూ పురాణాల ప్రకారం అత్యద్భుతమైన, అందమైన ప్రాచీన నగరం 250 కిలోమీటర్ల విస్తీర్ణంలో వుంది. సూర్య వంశానికి చెందిన 63వ రాజు దశరథుడు. 31వ రాజు సత్యహరిశ్చంద్రుడు.
 
శ్రీరాముని కన్నతల్లిలా చూసుకుంది సరయూనది. అవతార సమాప్తిలో తనలో కలుపుకుంది సరయూ నది. తులసీదాసు 1574లో రామచరితమానస్ గ్రంధాన్ని యిక్కడే ప్రారంభించాడు.
 
ఇక్కడి మందిరాలలో ఒకచోట వాల్మీకిని చిత్రించారు. ప్రక్కనే లవకుశుల చిత్రాలు వుండటం విశేషం. యుద్ధంలో పరాజితులు కాని వారి దేశం అని, యుద్ధమే లేని శాంతి నగరమని అయోధ్యకు పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. ఇక్ష్వాకువంశ ప్రభువులు పూజించే శ్రీరంగనాథ దేవాలయం అయోధ్యలో వుంది.