మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2015 (18:06 IST)

1000 సంవత్సరాల రామాలయం ఎక్కడుందో తెలుసా?

వాయుపుత్రుడైన హనుమంతుడు.. ఎంతటి పరాక్రమవంతుడో అంతటి సున్నితమైన మనసున్నవాడు. మనస్ఫూర్తిగా ఆయనని అర్ధించాలే గాని, ఆదుకోవడానికి ఆయన ఎంతమాత్రం ఆలస్యం చేయడు. భక్తి కొలది ఆయన అనుగ్రహం వుంటుంది కనుకనే, స్వామి ఆలయాలు భక్తులతో రద్దీగా కనిపిస్తూ వుంటాయి. అలా హనుమ తమ మహిమలను చూపే క్షేత్రంగా 'పెరుమాండ్ల సంకీస' కనిపిస్తుంది. 
 
సీతారామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు గర్భాలయంలో కొలువై వుండటం ఇక్కడి విశేషం. గర్భాలయానికి ఎదురుగా గల ప్రత్యేకమందిరంలో హనుమంతుడు దర్శనమిస్తుంటాడు. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం పరిధిలో ఈ గ్రామం వుంది. ఇక్కడి రామాలయం వెయ్యి సంవత్సరాలకి ముందు నుంచి వుంది. శ్రీరాముడి ఇష్టపడి కొలువైన క్షేత్రమిదంటున్నారు.