ఈ నెల 12నే బక్రీద్?? తేల్చి చెప్పిన రుయత్ ఏ హిలాల్ కమిటీ

ఎం| Last Updated: మంగళవారం, 6 ఆగస్టు 2019 (13:33 IST)
ముస్లిం సోదరులు జరుపుకునే పండగల్లో ఒకటైన బక్రీద్ ఈ నెల 12వ తేదీనేని రుయత్ ఏ హిలాల్ కమిటీ ఖ్వాజీ ముస్తాక్ మదానీ స్పష్టం చేశారు. ముస్లీం సోదరులకు అతి పవిత్రమైన పండుగలలో బక్రీద్ ఒకటి. అటువంటి పడుగ ఎప్పుడు చేసుకోవాలనే విషయం నెలవంక మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో బక్రీద్ పండుగకు సంబంధించి నెలవంక శనివారం కనబడిందని నెలవంక కనబడిన 10 రోజులకు బక్రీద్ పండుగను జరుపుకుంటామని తెలిపారు.

అంటే ఈ నెల 12వ తేదీన జరుపుకోవాలని రుయత్ ఎ హిలాల్ కమిటీ సభ్యులు ఖ్వాజీ మోలానా ముస్తక్ మదాని తేల్చి చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నెలవంక కనబడింది కాబట్టి అందులో భాగంగా ఇవాల్టి నుండి సరిగ్గా 10 రోజులలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని తెలిపారు. కొన్ని క్యాలెండర్‌‌లలో 12వ తేదీ అని మరికొన్ని క్యాలెండర్‌‌లలో 13 తేదీగాను ఉందని మీరు ఎటువంటి అయోమయానికి గురికాకుండా 12వ తేదినే పండుగ జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.దీనిపై మరింత చదవండి :