శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2017 (10:50 IST)

బక్రీద్ సంబరాలు... ముస్లిం సోదరులతో కిక్కిరిసిన మసీదులు

ముస్లిం సోదరుల పవిత్ర పండుగల్లో ఒకటైన బక్రీద్. ఈ పండుగ త్యాగానికి ప్రతీక. ఈ సందర్భంగా ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలను దృష్టిలో ఉంచుకొని.. భాగ్యనగరమంతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిఘా సంస్థల హ

ముస్లిం సోదరుల పవిత్ర పండుగల్లో ఒకటైన బక్రీద్. ఈ పండుగ త్యాగానికి ప్రతీక. ఈ సందర్భంగా ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలను దృష్టిలో ఉంచుకొని.. భాగ్యనగరమంతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిఘా సంస్థల హెచ్చరికలతో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పండగ రోజు ప్రత్యేక ప్రార్థనల దృష్ట్యా.. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
ఒకవైప వినాయక నిమజ్జనాలు.. మరోవైపు బక్రీద్ పండుగతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. చార్మినార్‌తో పాటు మీర్ ఆలం మండిలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనల దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. స‌మ‌స్యాత్మక ప్రాంతాల్లో నిఘాను పెంచారు. మ‌రో వైపు నిఘా సంస్థల హెచ్చరిక‌లతో నగరంలో భ‌ద్రత‌ను క‌ట్టుదిట్టం చేశారు. 
 
ప్రధాన కూడ‌ళ్లు, బ‌స్టాపులు, రైల్వే స్టేష‌న్ల దగ్గర నిఘాను పెంచిన పోలీసులు అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బక్రీద్ ప్రార్థనలు జరిగే ప్రాంతం.. గణేష్ శోభాయాత్రలు సాగే చోట.. అదనపు బలగాలను మోహరించారు. 
 
బ‌క్రీద్ ప్రత్యేక ప్రార్థనల దృష్ట్యా.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మీరాలం ట్యాంక్ ఈద్గా, బాలమ్‌రాయ్ ఈద్గా, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు ఉంటాయి. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో నగరవాసులు పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.