శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By tj
Last Updated : శుక్రవారం, 19 మే 2017 (12:51 IST)

రికార్డు స్థాయిలో శబరిమల అయ్యప్పస్వామి ఆదాయం... ఎంతో తెలుసా..?

శబరిమల వెళ్ళాలంటే చాలామంది భక్తులు ఎంతో ఇష్టపడుతుంటారు. కారణం శబరిమల స్వామివారి ప్రాభవం అలాంటిది. ప్రాంతం కూడా అంతటి ప్రాముఖ్యత కలిగినదే. శబరిమల చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయి

శబరిమల వెళ్ళాలంటే చాలామంది భక్తులు ఎంతో ఇష్టపడుతుంటారు. కారణం శబరిమల స్వామివారి ప్రాభవం అలాంటిది. ప్రాంతం కూడా అంతటి ప్రాముఖ్యత కలిగినదే. శబరిమల చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. ఒకటి రెండు కాదు వందల కోట్ల రూపాయల ఆదాయం శబరిమలకు వచ్చింది.
 
2016-17 ఫెస్టివల్‌ సీజన్‌లో రూ.243.69 కోట్ల ఆదాయం సమకూరినట్టు కేరళ ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. ఆలయంలో హుండీ లెక్కింపు ద్వారా రూ.89.70 కోట్లు, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.17.29 కోట్లు ఆదాయం వచ్చింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు నవంబర్‌ - జనవరి మాసాల్లో పెద్దసంఖ్యలో శబరిమలకు వచ్చి మొక్కులు తీర్చుకోవడం వల్లనే హుండీ ఆదాయం ఈ స్థాయిలో వచ్చినట్లు కేరళ ప్రభుత్వం తెలుపుతోంది.