గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2017 (08:50 IST)

శ్రీవారి సర్వదర్శనం : టైమ్ స్లాట్ సూపర్ సక్సెస్

ఆ ఏడుకొండలవాడి దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)బోర్డు ప్రయోగాత్మకంగా చేపట్టిన టైమ్ స్లాట్ విధానం తొలిరోజునే విజయవంతమైంది.

ఆ ఏడుకొండలవాడి దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)బోర్డు ప్రయోగాత్మకంగా చేపట్టిన టైమ్ స్లాట్ విధానం తొలిరోజునే విజయవంతమైంది. తొలి రోజున 12 వేల టోకెన్లు జారీచేయగా, ఆ భక్తులందరికీ నిర్ణీత వేళల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం లభించింది. దీంతో రెండో రోజైన మంగళవారం జారీ చేసే టోకెన్ల సంఖ్యను 20 వేలకు పెంచారు.
 
కాగా, శ్రీవారి సర్వదర్శనానికి తితేదే టైమ్‌ స్లాట్‌ విధానం సోమవారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించారు. సీఆర్వో వద్ద ఏర్పాటు చేసిన టైమ్‌ స్లాట్‌ టోకెన్ల జారీ కౌంటర్లకు అర్చకులు పూజలు చేసిన అనంతరం ఉదయం 6 గంటలకు జేఈవో శ్రీనివాసరాజు లాంఛనంగా ప్రారంభించారు. తొలుత.. తమిళనాడులోని తంజావూరుకు చెందిన భక్తురాలు శకుంతలారామన్‌ ఆధార్‌ కార్డును స్కాన్‌చేసి టోకెన్‌ జారీచేశారు.
 
తొలిస్లాట్‌కు ఉదయం 11 గంటలకు దర్శన సమయం కేటాయించారు. నిర్దేశిత సమయాల్లో దివ్యదర్శన కాంప్లెక్సుకు చేరుకున్న భక్తుల టోకెన్లను సిబ్బంది పరిశీలించి రాయితీపై రూ.25 చొప్పున రెండు లడ్డూలు అందించారు. ఆ తర్వాత క్యూలైన్‌లోకి వెళ్లిన భక్తులు 2 గంటల్లోపే స్వామిని దర్శించుకుని ఆలయం బయటకు వచ్చేశారు. 
 
కాగా, టైమ్ స్లాట్ టోకెన్ల జారీ కోసం కొన్ని చోట్ల ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో కేంద్రీయ విచారణ కార్యాలయం, సప్తగిరి సత్రాలు, కౌస్తుభం, సన్నిధానం, ఆర్టీసీ బస్టాండు, పద్మావతి నగర్‌ సర్కిల్‌, ఎంబీసీ-26, ఏటీసీ, వరాహస్వామి, నందకం విశ్రాంతి సముదాయాలు, కల్యాణవేదిక, గాలిగోపురం, శ్రీవారి మెట్టు మార్గాల్లో కలిపి మొత్తం 117 టైమ్‌స్లాట్‌ టోకెన్ల కౌంటర్లను ఏర్పాటు చేశారు.