మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Modified: శుక్రవారం, 3 జూన్ 2016 (11:47 IST)

రికార్డు స్థాయిలో మే నెలలో 25 లక్షల మంది భక్తుల శ్రీవారి దర్శనం

వేసవి సెలవులు కావడంతో మే నెలలో తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఒక్క నెలలోనే శ్రీవారిని 25,08,387మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో లభించింది. 79 కోట్ల 69 లక్షల రూపాయలు తితిదేకి లభించింది. 
 
అలాగే 60,50,483 మంది భక్తులు తరిగొండ వెంగమాంబ అన్నదాన సముదాయంలో అన్నప్రసాదాలను స్వీకరించారు. 14,51,968మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 97,24,718మంది భక్తులు లడ్డూలను భక్తులకు తితిదే అందించింది. 18,529మంది శ్రీవారి సేవకులు వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందించారు. ప్రతియేటా వేసవి సెలవుల్లో భక్తులు అధికసంఖ్యలో రావడం సహజం. అయితే ఈసారి భక్తుల రద్దీ మరింత పెరిగింది.