శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ లడ్డూల విక్రయం!
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) భక్తులకు శుభవార్త చెప్పింది. పరమ పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదాలను ఇకపై ఆన్‌లైన్‌లోనూ విక్రయించాలని నిర్ణయించింది. అంటే.. తిరుమల వెంకన్న లడ్డూలు కావాలనుకునేవారు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకంటే.. సమీపంలోని తితిదే సమాచార కేంద్రాలు, తితిదే కళ్యాణ మండపాల్లో తీసుకోవచ్చు.
శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరికీ అందిచాలన్న లక్ష్యంతో లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నారు. రూ.25కే రాయితీ లడ్డూలను అన్ని టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణ మండపాల్లో విక్రయిస్తున్నారు. అటు ప్రత్యేక ఆర్డర్‌పై స్వామివారి లడ్డూలు ఎంత మొత్తంలో కావాలన్నా.. పంపిణీ చేస్తామని టీటీడీ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రత్యేక ఆర్డర్ లడ్డూలకు భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో ఇకపై లడ్డూలను ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలు జరపాలని టీటీడీ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో లడ్డూలు ఆర్డర్ చేసేవాళ్లు.. వాటిని తమకు దగ్గరలోని టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కళ్యాణ మండపాల నుంచి సేకరించే సదుపాయాన్ని కల్పించింది.