గురువారం, 15 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2017 (13:39 IST)

జీఎస్టీ అమలుతో శ్రీవారి లడ్డూ ధర అప్.. గదులు, దర్శనటిక్కెట్లు కూడా..

జీఎస్టీ అమలుతో తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదం లడ్డూ ధరలు పెరగనున్నాయి. లడ్డూతో పాటు దర్శనం టిక్కెట్లు, ప్రసాదాల ధరలు కూడా పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానమే లక్ష్యంగా జూలై 1వ తేదీ నుంచి కే

జీఎస్టీ అమలుతో తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదం లడ్డూ ధరలు పెరగనున్నాయి. లడ్డూతో పాటు దర్శనం టిక్కెట్లు, ప్రసాదాల ధరలు కూడా పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానమే లక్ష్యంగా జూలై 1వ తేదీ నుంచి కేంద్రం జీఎస్టీని అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ విధానాలు ప్రతి ఏడాది రూ.20లక్షలకు పైగా ఆదాయం ఆర్జించే ఆలయాలకు కూడా వర్తిస్తాయి. 
 
ఈ క్రమంలో కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జించే తిరుమల శ్రీవారి ఆలయానికి కూడా జీఎస్టీ విధానాలు వర్తిస్తాయి. తద్వారా తిరుమల వెంకన్న ఆలయంలోని ప్రసాదాల ధరలు, దర్శన టిక్కెట్ల ధరలు పెరుగుతాయి. 
 
ప్రస్తుతం ఒక లడ్డూ తయారీకి రూ.35లు ఖర్చవుతున్న తరుణంలో జీఎస్టీ ద్వారా ప్రసాదాల తయారీ పదార్థాలపై అదనంగా ఆరు శాతం పన్ను చెల్లించాల్సి వుంటుంది. దీంతో లడ్డూ ప్రసాదాల ధర పెరిగే అవకాశం ఉంది. ఇంకా తిరుమల కొండపై గదుల రేట్లు కూడా పెరిగిపోతాయి.