గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. సంక్రాంతి
Written By selvi
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (14:09 IST)

సంక్రాంతికి నోరూరించే పనీర్ రసమలాయ్ ఎలా చేయాలి

పనీరును తురుముకుని చిన్నపాటి వుండలుగా సిద్ధం చేసుకోవాలి. పాలను చిక్కగా మరిగించుకోవాలి. పంచదార పొడిని నీటిలలో నానబెట్టి సిరప్‌లా చేసుకోవాలి. ఆపై వుండగా చేసిన పనీర్‌ను పంచదార సిరప్‌లో చేర్చి పది నిమిషాల

పండగ వేళ సంప్రదాయ వంటకాలతో పాటు స్వీట్లు ముందే సిద్ధం చేసుకుని స్నేహితులు, బంధువులకు పంచిపెట్టాలనుకుంటున్నారా..? అయితే నోరూరించే రసమలాయ్ స్వీటును ఇంట్లోనే తయారు చేసి.. మీ స్నేహితులకు పంచిపెట్టండి. సంక్రాంతికి వెరైటీగా రసమలాయ్ స్వీట్ ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
పాలు- ఒక లీటర్ 
పంచదార పొడి - 200 గ్రాములు
ఏలకుల పొడి - ఒక టీ స్పూన్ 
పనీర్ - 350 గ్రాములు 
కుంకుమ పువ్వు -రెండు చిటికెలు 
పిస్తా - అలంకరణకు 
 
తయారీ విధానం : 
పనీరును తురుముకుని చిన్నపాటి వుండలుగా సిద్ధం చేసుకోవాలి. పాలను చిక్కగా మరిగించుకోవాలి. పంచదార పొడిని నీటిలలో నానబెట్టి సిరప్‌లా చేసుకోవాలి. ఆపై వుండగా చేసిన పనీర్‌ను పంచదార సిరప్‌లో చేర్చి పది నిమిషాలు ఉడికించాలి. పాలను బాగా మరిగించి రబ్రీ చేసుకుని.. అందులో కుంకుమ పువ్వు చేర్చాలి. ఈ మిశ్రమంలో పనీరు ఉండలను చేర్చి పిస్తాతో గార్నిష్ చేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.