మంగళవారం, 13 జనవరి 2026
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By PNR
Last Updated : గురువారం, 31 జులై 2014 (15:30 IST)

ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్‌ను ఆవిష్కరించిన గోద్రెజ్ లాకింగ్ సొల్యూషన్

లాకింగ్ వ్యవస్థ (తాళాలు)లో అగ్రగామిగా వెలుగొందుతున్న గోద్రెజ్ లాకింగ్ సొల్యూషన్ అండ్ సిస్టమ్ (గోద్రెజ్ లాక్స్) తన రెండో ఎడిషన్ అయిన మొబైల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ (ఎంఈసీ) ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ సెంటర్‌ను ఆవిష్కరించింది. ఈ సెంటర్‌ను గోద్రెజ్ లాక్స్ రీజినల్ మేనేజర్ ప్రీతం బెనర్జీ బుధవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఎంఈసీ విజయవంతం కావడంతో తన రెండో ఎడిషన్ అయిన ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ తర్వాతి దశ ప్రాధాన్యతను వివరిస్తుందన్నారు. 
 
దీనికి సంబంధించిన టెక్నాలజీని ప్రదర్శనకు ఉంచారు. ఇది టచ్ అండ్ ఫీల్ అనుభూతిని కల్పిస్తుందన్నారు. లాకింగ్ వ్యవస్థలో 117 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం తమ సంస్థకు కలిగివుందని ఆయన చెప్పుకొచ్చారు. ఫస్ట్ ఎడిషన్ ఎంఈసీ తర్వాత రెండో ఎడిషన్ అయిన్ ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్‌ను ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది అన్ని రకాల వ్యవస్థలకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు.