శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సిహెచ్
Last Modified: గురువారం, 4 జూన్ 2020 (22:41 IST)

ట్రేడింగ్ చివరలో లాభాల తిరోగమనం చవిచూసిన భారతీయ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లలో 6-రోజుల విజయ పరంపరకు ఈరోజు అడ్డుకట్ట పడింది. ఎందుకంటే నిఫ్టీ మరియు సెన్సెక్స్ రెండూ కూడా అస్థిర ట్రేడింగ్ సెషన్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 0.38% లేదా 128.84 పాయింట్లు తగ్గి 33980.70 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 0.32% లేదా 32.45 పాయింట్లు పడిపోయి 10029.10 వద్ద ముగిసింది, అప్పటికీ ఇది 10 వేల మార్కు పైనే నిలిచింది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటికీ సూచీలు పతనమయ్యాయి.
 
2.48% పెరిగిన పిఎన్‌బి మినహా చాలావరకు బ్యాంకింగ్ స్టాక్స్ రోజుకు అనానుకూలంగా వర్తకం చేశాయి వీటిలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాక్ 2.67%, బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ 0.46%, ఎస్‌బిఐ స్టాక్ 0.23%, ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ 2.42% తగ్గాయి. ఈరోజున, సుమారు 1132 షేర్లు క్షీణించగా, 1287 షేర్లు ముందుకు సాగాయి, 156 షేర్లు మారలేదు.
 
వేదాంత (7.70%), టెక్ మహీంద్రా (5.20%), జీ ఎంటర్టైన్మెంట్ (5.52%), భారతి ఎయిర్‌టెల్ (5.73%), మరియు సన్ ఫార్మా (4.17%) ఈ రోజు గణనీయంగా లాభాలు పొందినవారి జాబితాలో ఉన్నాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్ (4.64%), బజాజ్ ఫైనాన్స్ (4.04%), ఇండస్ఇండ్ బ్యాంక్ (3.57%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (2.67%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (3.54%) మార్కెట్లో అత్యధిక నష్టాలను చవిచూశాయి. 2% తగ్గిన నిఫ్టీ బ్యాంక్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు సానుకూలంగానే ఉన్నాయి.
 
టాటా పవర్
టాటా పవర్ తన షిప్పింగ్ వ్యాపారం అమ్మకం ద్వారా 200 మిలియన్ డాలర్లు ఆశిస్తున్నట్లు ప్రకటించింది. ఈ వార్తలకు ప్రతిస్పందనగా టాటా పవర్ షేర్ ధర 2.04% పెరిగి రూ. 42.55 వద్ద ముగిసింది
 
బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్
బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వాటా 1.74% తగ్గి రూ. 2238 వద్ద ట్రేడవుతోంది. మార్చి 2020 త్రైమాసికంలో ఈ కంపెనీ రూ .110.46 కోట్ల ఏకీకృత అమ్మకాన్ని నివేదించింది. అంతకుముందు త్రైమాసికంలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే ఈ అమ్మకాలు 27.17 శాతం ఎక్కువ.
 
రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ క్యాపిటలైజేషన్ కంపెనీ వాటా 2.23% పెరిగి రూ. 1576 వద్ద ట్రేడవుతున్నందున 10 లక్షల కోట్లయింది. ఈ షేరు రూ.1589 లతో ఇంట్రాడే అత్యధికాన్ని తాకింది.
 
బిపిసిఎల్
మార్చి 2020 త్రైమాసికంలో 1819.56 కోట్ల సమీకృత నష్టం నివేదించబడిన తరువాత, ఈరోజు తొలి సమయంలో, కంపెనీ ఆయిల్ రిఫైనర్ బిపిసిఎల్ వాటా 3% తగ్గింది. అయినప్పటికీ, తరువాతి సమయంలో ఈ స్టాక్ 2.11% కోలుకొని రూ. 356.40 వద్ద ట్రేడయింది.
 
బంగారం
ఆర్థిక పునరుద్ధరణ సంకేతాల తరువాత ఏప్రిల్ 30 నుండి కొనసాగుతున్న బంగారు ధరలు రోజంతా పెరిగాయి.
 
భారతీయ రూపాయి
ఈరోజు, భారతీయ రూపాయి 11 పైసలు తగ్గి డాలర్‌కు రూ.75.57గా ఉంది.
 
చమురు ధరలు
గురువారం రోజున, యుఎస్ ఇంధన ఇన్వెంటరీలను ఏర్పాటు చేసుకోవాలనే ఆదుర్ధాల వలన చమురు ధరలు పడిపోయాయి. ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులైన సౌదీ అరేబియా మరియు రష్యా మద్దతు ఇచ్చే అవుట్పుట్ కోతల్లో మరింత పొడిగింపు చమురు ధరల తగ్గుదలకు ఆజ్యం పోసింది.
 
ప్రపంచ మార్కెట్స్
కరోనావైరస్ మహమ్మారి యొక్క నిరంతర ముప్పు కారణంగా యూరోపియన్ స్టాక్ ఈరోజు, తక్కువగా ప్రారంభమైంది. యు.ఎస్‌లో నిరసనలు పెట్టుబడిదారులలో ప్రతికూల భావాలకు ఆజ్యం పోశాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు లాభాలను మూడు రోజులూ కొనసాగించాయి. ఎక్కువ దేశాలు తమ ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడం మరియు పునరుద్ధరించడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లో వృద్ధి కనిపించింది. నాస్‌డాక్ 0.78%, నిక్కీ 225 0.36%, హాంగ్ సెంగ్ 0.17%, ఎఫ్‌టిఎస్‌ఇ ఎంఐబి 0.88% పెరిగాయి.
 
- అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్.