భారత్‌ను చిత్తు చేసిన పాకిస్థాన్... టైటిల్ కైవసం (video)
భారత్‌ను పాకిస్థాన్ చిత్తుచేసింది. కబడ్డీ వరల్డ్‌కప్ ఫైనల్ పోటీలో భారత్‌ను ఓడించిన పాకిస్థాన్... విజయభేరీ మోగించింది. ఫలితంగా టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
లాహోర్‌లోని పంజాబ్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో.. భారత్‌పై 43-41 స్కోర్ తేడాతో పాక్ నెగ్గింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో.. తొలి అర్థ భాగంలో ఫస్ట్ హాఫ్‌లో భారత్ డామినేట్ చేసింది. కానీ సెకండ్ హాఫ్‌లో పాక్ తన జోరును ప్రదర్శించి.. కబడ్డీ వరల్డ్‌కప్‌ను తొలిసారి తన ఖాతాలో వేసుకున్నది.
రెండు సెషన్స్‌లోనూ రెండు దేశాల మధ్య మ్యాచ్ నువ్వానేనా అన్నట్టుగా సాగింది. పాక్ ఆటగాళ్లు బిన్‌యామీన్, ఇర్ఫాన్ మానా, షఫిక్ చిస్తీలు తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కబడ్డీ వరల్డ్‌కప్ తొలిసారి పాకిస్థాన్‌లో జరిగింది. గతంలో ఆరుసార్లు ఈ టోర్నమెంట్‌ను ఇండియాలోనే నిర్వహించారు.
8 రోజుల పాటు సాగిన టోర్నీలో లాహోర్, ఫైసలాబాద్, కర్తార్‌పూర్, నాన్‌కన్ సాహిబ్ నగరాల్లో మ్యాచ్‌లను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఇండియాతో పాటు ఇరాన్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, సియరాలియోన్, కెన్యా కూడా పాల్గొన్నాయి. టైటిల్ గెలిచిన పాక్‌కు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ కంగ్రాట్స్ చెప్పారు.